దశాబ్దాల కాలం నుంచీ కూరుకుపోయిన ‘ ఉద్దానం ‘ కిడ్నీ సమస్య ని అందరికీ తెలిసేలా చేసింది కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రభుత్వాలు మారినా , ముఖ్యమంత్రులు మారినా , అధికారుల ట్రాన్స్ఫర్ లు తప్ప అసలు ఆ ఉద్దానం అనేది ఒకటి ఉంది అని కూడా ప్రపంచానికి తెలియని పరిస్థితి లో అసలు నిజాలు బయటపెట్టిన ఘనత కళ్యాణ్ ది మాత్రమె. ఆ ప్రాంతపు సమస్యలు – అక్కడ ప్రపంచం లోనే అత్యధిక సంఖ్యలో కిడ్నీ బాధితులు ఉన్నారు అన్న సంగతి తెలుసుకుని చుట్టుపక్కల వైజాగ్ లాంటి ప్రాంతం జనాలే షాక్ కి గురైన పరిస్థితి ఉంది. అంతగా నిజాలని దాచి దశాబ్దాలు గా కప్పి ఉంచారు మరి. గడిచిన నెలల కాలం లో పూర్తిగా తన సమయం లో ఎక్కువ వంతు అక్కడివారి కోసం కేటాయిస్తున్న పవన్ కళ్యాణ్ తన సేన సహాయం తో వారిని ఒక ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు.

హార్వర్డ్ యూనివర్సిటీ లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచ్ తరవాత ఒక స్పెషల్ టీం ఆఫ్ డాక్టర్ లు ఉద్దానం సమస్య ని క్షుణ్ణంగా పరీక్షించడం కోసం ఈ నెల 29 న విజాగ్ రానున్నారు. ఆ ప్రాంతం లోనే అంతగా ఈ వ్యాధి వ్యాపించడం కోసం గల కారణాలు వెతుకుతారు వారు. ఆ మరుసటి రోజు జనసేన సమక్షం లో ఒక భారీ మెడికల్ క్యాంప్ ని వైజాగ్ లో నిర్వహించ బోతున్నారు. ఇప్పటికే ఉద్దానం ప్రాంతం లో వ్యాధి గ్రస్తుల ని ఎంపిక చేసి వారికి బస్ పాస్ లు ఫ్రీగా ఇప్పించింది జనసేన. కొత్తగా డయాలసిస్ సెంటర్ లు ఎన్నో వెలిసాయి కూడా. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న అనేకమందికి ప్రభుత్వం నుంచి స్పెషల్ పెన్షన్ వచ్చే ఏర్పాటు ఇన్నేళ్ళ కి అక్కడ జరిగింది అంటే అది ఖచ్చితంగా జనసేన చలవే. అధికారం లో ఉండి ధన దాహం లో మునిగిపోయిన ఎందరో రాజకీయ వేత్తలు ఏళ్ళు గా చెయ్యలేకపోతున్న పనిని పవన్ కళ్యాణ్ అన్న ఒకే ఒక్క వ్యక్తి కేవలం నెలల వ్యవధి లో సాధించాడు అంటే ఏపీ భవిష్యత్తు కి అతను ఎంత అత్యవసరమో అర్ధం అవుతోంది.