ivanka trump to visit hyderabad India for India us Entrepreneur Summit

★ నవంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు
★ భారత, అమెరికా దేశాల ఆధ్వర్యంలో
★ హైదరాబాద్ లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు
★ సదస్సుకు ప్రధాని నరేంద్రమోడితో పాటు అమెరికా
అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ హాజరు 
★ సదస్సు వివరాలను ట్వీట్ చేసిన ప్రధాని మోడీ
★ సదస్సు నిర్ణయం పై సి ఎం కేసీఆర్ హర్షం

భారత, అమెరికా దేశాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ప్రపంచ పెట్టుబడిదారుల(పారిశ్రామిక వ్యవస్థాపకులు) సదస్సుకు భారత ప్రధాని నరేంద్రమోడితో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ హాజరయ్యేందుకు అంగీకరించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏడాది నవంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక వ్యవస్థాపకులు ఈ సదస్సులో పాల్గొనడం ఔత్సాహికులకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని సిఎం అభిప్రాయపడ్డారు. చారిత్రక నగరమైన హైదరాబాద్ ఈ చారిత్రక సదస్సుకు వేదిక అవుతుండడం సంతోషంగా ఉందన్నారు. ఈ సదస్సుకు వచ్చే అమెరికా బృందానికి ఇవాంకా నాయకత్వం వహిస్తుండగా, భారత దేశం తరుఫున ప్రధాని నరేంద్ర మోడీ అమితాసక్తి చూపడం గొప్ప విషయమని సిఎం అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ సదస్సుకు సంబంధించిన సమాచారాన్ని ట్విట్టర్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు ప్రధానికి సిఎం ధన్యవాదాలు తెలిపారు.