హలోఫ్రెండ్స్ తస్మాత్ జాగ్రత్త Facebook మోసగాళ్లు Rs .8.52 లక్షలు టోకరా …

ప్రేమ మోసాలు ,డబ్బు మోసాలు రోజు రోజు కి ఎక్కువా అయిపోతున్నాయి ఫేస్ బుక్ లో. ఆఖరికి ఈరోజు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కూడా 8.52  లక్షలు మోసపోయింది అసలు విషయానికి వస్తే …..

పెనుమలూరు మండలం కానూరు గ్రామానికి చెందిన కడియం శివకామేశ్వరి నూజివీడులోని సీతారాంపురంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది ఫేస్ బుక్ లో శివకామేశ్వరికి అశ్విధామ్సన్‌ అనే అపరిచిత వ్యక్తి తో పరిచయం ఏర్పడింది ,ఆ పరిచయం తో ఫ్రెండ్స్ అయ్యారు .రోజు చాట్ చేసేవారు .

ఇదిలా ఉండగా ఒక రోజు (అనగా 15 రోజుల క్రితం ) అశ్విధామ్సన్‌ చాట్ చేస్తూ మీకు Rs. 41 లక్లల విలువైన ఆభరణాలు ,సామాగ్రి బహుమతిగా వచ్చాయని చెప్పాడు .కాకపోతే కొంచెం స్థానిక చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పాడు. ఇదిలా ఉండగా ఢిల్లీకి చెందిన ఎలాయిడ్ కొరియర్ సర్వీస్ నుంచి శివకామేశ్వరికి ఫోన్ వొచింది .స్థానిక చార్జీలు 8.52 లక్షలు అని చెప్పారు .నిజమే అని నమ్మిన శివకామేశ్వరి రెండు SBI,ICICI అకౌంట్స్ కి 8.52 లక్షలు ట్రాన్స్ఫర్ చేసింది . డబ్బు చెల్లించిన ఇంకా కొరియర్ రాకపోవటం తో అనుమానం చెందిన శివకామేశ్వరి అశ్విధామ్సన్‌ తో మాట్లాడడం అని ఫేస్ బుక్ లో చాట్ చేసింది ,కానీ అసలు అతను ఫేస్ బుక్ ఆన్ చేయటం లేదు .తను ఫేస్ బుక్ లోకి రాకపోవటం తో మోస పోయానని భావించిన శివకామేశ్వరి పోలీసులను ఆశ్రయించింది కేసు ని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ దామోదర్ తెలిపారు .

చూస్తున్నారుగా Friends ఎన్ని మోసాలు ,ఘోరాలు జరుగుతున్నాయో ,ఇప్పటికైనా, ఫేస్ బుక్  లో అపరిచిత వక్తులతో స్నేహం చేయకండి ,ఇలాంటివి జరిగేసరికి స్నేహం అనే పదానికి వేల్యూ లేకుండా పోతుంది .సో తస్మాత్ జాగ్రత్త ఫేస్ బుక్ తో….