Agnyaathavaasi Movie Review ,Ratings

 

అజ్ఞాతవాసి రివ్యూ & రేటింగ్

ప‌వ‌న్ క‌ల్యాణ్ వంటి హీరో సినిమా అంటేనే క‌థంతా అత‌ని చుట్టూనే తిరుగుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ సినిమా క‌థ కూడా ప‌వ‌న్‌ను బేస్ చేసుకునే ర‌న్ అయ్యింది. బాల‌సుబ్ర‌మ‌ణ్యం, అభిష‌క్త భార్గ‌వ అనే రెండు షేడ్స్‌లో ప‌వ‌న్ న‌ట‌న ఆక‌ట్టుకుంది. సినిమా మొత్తాన్ని త‌న భుజాల‌పై ముందుకు తీసుకెళ్లాడు. త‌న‌దైన మార్కు డైలాగ్స్‌, యాక్ష‌న్స్ సీక్వెన్స్‌, న‌ట‌న‌తో ప‌వ‌న్ అభిమానులను మెప్పించ‌డం ఖాయం. ఇక సినిమాలో చెప్పుకోవాల్సిన మ‌రో పాత్ర ఖుష్బూ.. ఇంద్రాణి పాత్ర‌లో చ‌క్క‌గా ఒదిగిపోయింది. స్టాలిన్ త‌ర్వాత మ‌రోసారి తెలుగులో మంచి పాత్ర‌లో క‌న‌ప‌డింది ఖుష్బూ. క్లైమాక్స్‌లో ఖుష్బూ న‌ట‌న మెప్పిస్తుంది. ఇక సినిమాలో భాగ‌మైన కీర్తిసురేష్‌, అను ఇమాన్యుయేల్ పాత్ర‌లు గ్లామ‌ర్‌కే ప‌రిమిత‌మయ్యాయి. న‌ట‌న‌కు పెద్ద‌గా స్కోప్ లేని పాత్ర‌లు వారివి. ఇక విల‌న్‌గా న‌టించిన ఆది పినిశెట్టి త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. అయితే త‌న రోల్‌ను ఇంకా బ‌లంగా డిజైన్ చేసుంటే హీరో క్యారెక్ట‌రైజేష‌న్ ఎలివేట్ అయ్యుండేది. ముర‌ళీశ‌ర్మ‌, రావు ర‌మేష్ పాత్ర‌లు కామెడీకి ప‌రిమితం. మిగిలిన పాత్ర‌ధారులంద‌రూ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

ఆంధ్రజ్యోతి రేటింగ్ : 2.75/5

తెలుగు సమయం రేటింగ్ : 4/5

ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్‌కు నేనేం చేసినా జ‌నాలు చూస్తార‌న్న ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ ఉండేది. స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌, కాట‌మ‌రాయుడు సినిమాలు ఈ కోవ‌లేనివే. ఇప్పుడు త్రివిక్రమ్ తాను ఏం తీసినా జ‌నాలు చూస్తార‌ని తీసిన సినిమాయే ఈ అజ్ఞాత‌వాసి. ఓవ‌రాల్‌గా త్రివిక్ర‌మ్ సినిమాల్లోనే వీకెస్ట్ కంటెంట్‌తో తెర‌కెక్కింది అజ్ఞాత‌వాసి. ప‌వ‌న్ మేనియా, త్రివిక్ర‌మ్‌, భారీ కాస్టింగ్ ఈ సినిమాను కాపాడ‌లేక‌పోయాయి. అయితే భారీ రిలీజ్‌, ఎక్కువ థియేట‌ర్ల‌లో రిలీజ్ అవ్వ‌డంతో సినిమాకు ఓపెనింగ్స్ వ‌ర‌కు ఉండొచ్చు.ఇంకా ఉంది .

తెలుగు జర్నలిస్ట్ రేటింగ్ : 2/5

సినిమా కథ పాతదే అని చెప్పుకోవాలి. తండ్రిని చంపిన వారి మీద పగ తీర్చుకునే కథలు చాలా వచ్చాయి. కథనం విషయంలో కూడా త్రివిక్రం మార్క్ గ్రిప్పింగ్ మిస్ అయ్యిందని చెప్పాలి. ఇక సినిమాలో పవన్ రెండు పాత్రలు వేరియేషన్ ఏమి లేదు. అయితే సినిమా మాత్రం పవన్ ఫ్యాన్స్ కు నచ్చే అంశాలతో తెరకెక్కించారు.సినిమాలో ప్రతి ఫ్రేం చాలా రిచ్ గా కనిపిస్తుంది. కోటగిరి వెంకటేశ్వర్ రావు ఎడిటింగ్ ఓకే అక్కడక్కడ కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది అది ట్రిం చేస్తే బాగుండేది. ఇంకా ఉంది .

తెలుగు లీవ్స్ రేటింగ్ : 2.5/5

సినిమాలో త్రివిక్రమ్ చమత్కారం బాగా తగ్గింది. ‘‘సింహం పార్టీకి పిలిచిందని జింక జీన్స్ ప్యాంటేసుకుని వచ్చిందట’’ తరహా పంచులు.. ‘‘విచ్చలవిడిగా చేస్తే విధ్వంసం.. విచక్షణతో చేస్తే ధర్మం’’ లాంటి ఫిలసాఫికల్ డైలాగుల్లో త్రివిక్రమ్ మార్కు కనిపిస్తుంది కానీ.. మాటలు అతడి స్థాయిలో అయితే లేవు. రచయితగా.. దర్శకుడిగా త్రివిక్రమ్ ఇప్పటిదాకా తీసిన అన్ని సినిమాల్లో ‘అజ్ఞాతవాసి’నే అత్యంత బలహీనమైంది అనడంలో సందేహమే లేదు.. ఇంకా ఉంది.

తుపాకీ రేటింగ్ : 2.25/5