Hello Movie Review Ratings

హలో మూవీ రివ్యూ…

వివిధ వెబ్ సైట్స్ నుండి ఇచ్చిన సమాచారం ..

కథ కథనాలు అన్ని సినిమా మొత్తం మనసుకి హత్తుకునేలా విక్రం కుమార్ తెరకెక్కించాడు. మొదటి భాగం కాస్త ఎంటర్టైనింగ్ మోడ్ లో సాగగా సెకండ్ హాఫ్ సినిమాకు ప్రాణం అని చెప్పొచ్చు. యూత్ కు బాగా నచ్చేలా ఫీల్ గుడ్ మూవీతో పాటుగ స్టంట్స్ తో కూడా అలరించాడు అఖిల్. Read More@TeluguLives 

TeluguLives  Rating : 3/5

సినిమాలో కామెడీ ట్రాక్ ఎక్కడా లేదు. ఫస్టాఫ్ మరీ డల్ గా ముందుకు సాగుతుంది. సెకండాఫ్ కొంతలో కొంత పర్వాలేదన్పిస్తుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న రెండవ సినిమాతోనూ అఖిల్ అంచ‌నాల‌ను కొంచెం మాత్ర‌మే అందుకున్నాడు. Read More@ Telugu Journalist

Telugu Journalist Rating : 2.75/5

కాలం మ‌రింత వేగ‌వంతంగా సాగుతున్న ఈ కాలంలో ఒక్క ఫోన్ నెంబర్‌ని ట్రేస్ చేయ‌లేక ఇబ్బందిప‌డే హీరో విష‌యం మాత్రం అంత తేలిగ్గా మింగుడుప‌డ‌దు. ఇలాంటి కొన్ని లాజిక్కుల‌ను ప‌క్క‌న‌పెట్టి, రెండు హృద‌యాలు ప‌డే ఆవేద‌న‌గా చూస్తే సినిమా బావున్న‌ట్టే. Read More@ AndhraJyothi

 AndhraJyothi Rating : 3.25/5

అఖిల్ నటన పరంగా కంటే డాన్సులు, ఫైట్స్ బాగా చేశాడు. ముఖంలో కొన్ని హావభావాలు సరిగ్గా పలికించలేకపోయాడు. యాక్షన్ సీన్స్‌లో అతడి కష్టం తెరపై కనిపిస్తుంది. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ అనే ఫీలింగ్ కలిగించలేకపోయింది. కొన్ని చోట్ల ఎమోషన్స్ పలికించడానికి ఇబ్బంది పడింది. రమ్యకృష్ణ, జగపతి బాబు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశాడు. టెక్నికల్‌గా సినిమా విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చిత్రానికి ప్రధాన బలం. పాటలు కూడా మెప్పిస్తాయి. అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. ఎడిటింగ్ వర్క్ మీద ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. మాస్ ఆడియన్స్‌కు ఈ సినిమా నచ్చకపోవచ్చు.. కానీ యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ‘హలో’కి కనెక్ట్ అవుతారు. Read More@TeluguSamayam 

Telugu Samayam Rating : 3/5